Saturday, June 03, 2006

స్త్రీ పురుష సంభందమూ -చలం- 'ప్రేమ లేఖలు' నుంచి

స్త్రీ పురుష సంభందమూ యిట్లాంటిదే! కావాలని ఆ సంభందాన్ని మురికి అవ్యవాలతో ముడిపెట్టాడి దేవుడు! అంత అందమైన ప్రేమ భావాన్ని, దైవత్వాన్ని రుచి చూసే ఆ మృదు ఆకర్షణకి అంతమూ సాఫల్యమూ అతి నీచం చేసాడు. ఆ సమయాన మనం మనుషలమేనా అనిపించేటట్టు చేశాడు. హృదయం దేవ లోకంలో సంచరిస్తో ఉంటుంది. శరీరం పాతాళంలోకి దిగుతో వుంటుంది. ఆ నరక కూపంలో స్వర్గాన్ననుభవింప జేస్తున్నాడు. పోనీ యీ గొడవ. అందరూ సుఖంగానే యే అసహ్యమూ లేకుండా బతుకుతున్నారే యివన్ని తలచుకోకుండా! నా కెందుకీ భాధ!

1 comment:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

స్త్రీపురుషావయవాలు ముఱికేమీ కాదు. మనమనుకోవడమే తప్ప. వారం రోజులపాటు తలస్నానం చెయ్యకపోతే తల కూడా వాసనొస్తుంది. (మనక్కాదు, ఇతరులకు). యోని పార్వతీస్వరూపం. లింగం శివస్వరూపం.