Sunday, November 19, 2006

Blogger to Wordpress

My Blog was shifted to Wordpress, I would like to talk to you all there @ Raju's Blog @ Wordpress now my blog is very simple http://raju.wordpress.com

Saturday, September 23, 2006

విజయవాడ తో నా అనుభంధం...

విజయవాడ తో నా అనుభంధం... పుట్టింది...పెరిగింది..చదివింది....అంతా విజయవాడ లోనే....3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను...కాని మనసు అంతా విజయవాడే(... 22సంవత్సరాల అనుభందం .. నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. ఈ ఫొటో బాగుందని... పెట్టేసాను. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు... అన్నీ ఒక సారి స్కాన్ చేయాలి...

Tuesday, June 06, 2006

గోదావరి...

శేఖర్ కమ్ముల: నిజంగా గురువు గారు అమ్మాయిల గురించి బాగా స్టడీ చేశినట్లు న్నారు. లేకపోతే ఈ కాలం అమ్మయిల గురించి ఈ మధ్య కాలంలో అంత చక్కగా,కరెక్ట్గా ఎవరూ తెరకెక్కించలేదు.(ఆనంద్ అండ్ గోదావరి...రెండు సినిమాల లోను).పాత్రల మద్య సంఘ్రషణ కాకుండా, పాత్రల మనస్త్వత్వాల మధ్య సంఘర్షణ ని చూపించటంలో శేఖర్ స్క్రీన్-ప్లే నిజంగా అధ్బుతం

శ్రీ రాం:
ఈ తరానికి, పోటీ బ్రతుకు లకి, నిశ్చల నిశ్చితాలకి అందని , అర్ధం కాని...ఉన్నతమైన వ్యక్తిత్వం..ఉన్న పాత్రలో సుమంత్ నిజంగా సరి పోయాడు. నాకే అలా అనిపిస్తోందో..లేకపోతే నిజంగా నిజమేనేమో... ఆ పాత్రకి సుమంత్ తప్ప ఎవరూ నప్పరేమో అనిపిస్తూంది. ఒక వైపు మరదలి ప్రేమ కోసం ఆరాటం..మరొక వైపు సామాజిక స్పృహ ని ఒకే పాత్రలో పోషించిన సుమంత్ నిజంగా అభినందనీయుడు.

సీత: ఈ పాత్ర గురించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకంటే..సీత ప్రతి సినిమాలో పాటల కోసం..గ్లామర్ కోసం కనిపించే మామూలు హీరోయిన్ కాదు. నేటి తరం అమ్మాయిలకి, వాళ్ళ మనస్తత్వానికి స్పష్టమైన ప్రతిబింబం. సీత పాత్రలోని అమాయకత్వం, గడుసుతనం, స్వాభిమానం,కొంటెతనం, అక్కసు, అసూయ, ఆడతనం... ని కమలిని చాలా చక్కగా చూపించింది.

రాజీ:
అయోమయానికి, అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం- రాజీ పాత్ర. కేవలం గిఫ్టుల్లోనే ప్రేమని చూసే కొంత శాతం అమ్మాయిల ప్రతినిది.

మనసుకి గుచ్చుకున్న సన్నివేశాలు/డైలాగులు:
శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):
1.ఇప్పుడు ఇష్టాలు భలే మారిపోతాయి కదూ! (పరిపూర్ణమైన 'ప్యూర్ జెలసీ' ని పాటి చూపించే డైలాగ్)
2.'ఇన్నేళ్ళలో నన్ను ఎప్పుడైనా, ఒక్క నిమిషమైనా భర్తగా ఊహిచుకున్నావా?' అని మరదలిని అడిగినప్పుడు ... శ్రీ రాం లో మనల్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఉండలేము.(ప్రేమ లో మునిగిన వాళ్ళా కి మాత్రమే)
3. --బెలూన్ల కుర్రాడికి శ్రీ రాం ఊరికే డబ్బివ్వబోతే ఆ కుర్రాడు 'నేను ముష్టి వాణ్ణి కాదు' అనటం
--పుల్లట్ల పుల్లమ్మ, తన తమ్ముడికి ఊరికే డబ్బిచ్చిన శ్రీ రాం తో, తన తమ్ముడు ముష్టివాడు కాదని కోప్పడే సీన్
--పుల్లట్ల పుల్లమ్మ తో బెలూన్ల కుర్రాడు 'నేను నీ తమ్ముడు లాంటి వాడినే..ఊరికే నాకూ వొద్దూ' అని వెళ్ళిపోయే సన్నివేశాలలో..చప్పట్లు కొట్టకుండా ఉండలేము.

4. కుక్క: 'ఎంత జాతి కుక్కవైనా నీకు ఇండిపెండెన్స్ లేదు రా' అన్నప్పుడు ఒక్క సారి చురక పడ్డట్లు ఉంటుంది.

5. శ్రీ రాం: 'దేవుడా! నాకు అమ్మయిలు అర్ధం కారు' అని ఫీల్ అయ్యేటప్పుడు...నేను మటుకు కోరస్ కలిపాను.

6. సీత: ఇంటికి తిరిగి వచ్చాక శ్రీ రాం గురించి అమ్మ్తో 'రెండు రోజుల్లో అంతా హిస్టరీ అయిపోతుంది' అన్నప్పుడు... అమ్మాయిలు మరీ -------- అని అనిపిస్తుంది.

Saturday, June 03, 2006

స్త్రీ పురుష సంభందమూ -చలం- 'ప్రేమ లేఖలు' నుంచి

స్త్రీ పురుష సంభందమూ యిట్లాంటిదే! కావాలని ఆ సంభందాన్ని మురికి అవ్యవాలతో ముడిపెట్టాడి దేవుడు! అంత అందమైన ప్రేమ భావాన్ని, దైవత్వాన్ని రుచి చూసే ఆ మృదు ఆకర్షణకి అంతమూ సాఫల్యమూ అతి నీచం చేసాడు. ఆ సమయాన మనం మనుషలమేనా అనిపించేటట్టు చేశాడు. హృదయం దేవ లోకంలో సంచరిస్తో ఉంటుంది. శరీరం పాతాళంలోకి దిగుతో వుంటుంది. ఆ నరక కూపంలో స్వర్గాన్ననుభవింప జేస్తున్నాడు. పోనీ యీ గొడవ. అందరూ సుఖంగానే యే అసహ్యమూ లేకుండా బతుకుతున్నారే యివన్ని తలచుకోకుండా! నా కెందుకీ భాధ!

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

ఆయన గొప్ప ఋషి. దివ్యదృష్టితో జరగబోయే విషయాలను తెలుసుకోగలడు.తనకు ఆయుష్షు తీరిందని, వచ్చే జన్మలో పందిగా పుడతాడని తెలుసుకున్నాడాయన. ఏదో జన్మలో చేసిన పాపం కొంచెం మిగిలి ఉండడం వల్ల అలా పుట్టక తప్పదనీ గ్రహించాడు.

ఏం చేయాలి?

శిష్యుడ్ని పిలిచి ఇలా చెప్పాడు. చూడు శిష్యా, నేను త్వరలో మరణించబోతున్నాను. నువ్వు నాకో సహాయం చేయాలి. అయ్యో గురువు గారూ, ఎంతటి అమంగళ వార్త చెప్పారు.మీరేం చెప్పినా నేను చేస్తాను. ఆజ్ఞాపించండి. అక్కడ ఒక పంది కనబడుతోంది చూశావా? దాని నాలుగో పిల్లడిగా నేను పుట్టబోతున్నాను. పుట్టిన వెంటనే కత్తితో పొడిచి నన్ను చంపెయ్యి.

శిష్యుడికి చాలా దుఃఖమేసింది.కాని ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే గురువుగారు చనిపోయారు.శిష్యుడు ఆ పందిని కని పెట్టి చూస్తూ ఉన్నాడు.అది ఒక రోజు పిల్లల్ని కంది.గురువుగారు చెప్పినట్టు నాలుగు పిల్లలే పుట్టాయి. నాలుగో దాని నుదుటిన చిన్న గాటు ఉంటుంటుదని చెప్పాడు గురువు. శిష్యుడు దగ్గరకెళ్ళి చూశాడు. నిజంగానే గాటు ఉంది.

శిష్యుడికి కర్తవ్యం గుర్తుకొచ్చింది.గురువు కిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కత్తి తీసుకుని దాని దగ్గరికి వెళ్ళాడు. కత్తి పైఎత్తి వేటు వేసే లోపల ఆ చిన్న పంది పిల్ల ఒక్క అరుపు అరిచింది.

వద్ద్డొద్ద్డు చంపొద్దు అంది.

శిష్యుడు నిర్ఘాంతపోయాడు.

పంది పిల్ల మానవ గొంతుతో మాట్లాడటం అతనికి ఆశ్చర్యం కలిగింది. చేష్టలుడిగి నిలబడిపోయాడు. దయచేసి నన్ను చంపొద్దు. నాకు పందిలా కూడా బతకాలని ఉంది.నన్ను చంపమని నీకు నేను చెప్పినపుడు పంది జీవితం ఎలా ఉంటుందో నాకు తెలెయదు. కాని ఇప్పుడు అదీ బాగానే ఉందనిపిస్తోంది.ఇలాగే బతుకుతాను.నన్ను వదిలెయ్యి అంది పందిపిల్ల.

* * * * * పంది జీవితం బాగుండదని చెప్పడానికి మనమెవరం? అనుభవిస్తే గాని తెలియవేమో కొత్త జీవన సౌందర్యాలు. * * * * *

Friday, June 02, 2006

జంబూక బోధ - స్నేహం గురించి


స్నేహం గురించి ఒకసారి ఒక నక్క ఒకమ్మాయికి మంచి లెక్చర్ ఇచ్చింది. ఆ లెక్చర్లో అది స్నేహాన్ని స్నేహం అనక 'మచ్చిక' అంది. మచ్చిక విధివిధానాలు ఎలా ఉంటాయో అది భలేగా వివరించింది. 'నువ్వు నన్ను మచ్చిక చేసుకున్నావనుకో నేను నీకు, నువ్వు నాకు ప్రత్యేకమైన మనుష్యులుగా లేదా జంతువులుగా ఉండిపోతాం. నీ అడుగుల సవ్వడిని ఎంత మంది మధ్యలో ఉన్నా నేను గుర్తు పట్టగలుగుతాను. నువ్వయినా అంతే, మామూలుగా అయితే రెల్లు పూలు నాకు పెద్దగా నచ్చవుగాని ఇక నుంచి మాత్రం వాటిని చూసినప్పుడల్లా నువ్వు, నీ తెల్లటి చర్మమే గుర్తొస్తాయి నాకు.

ఆ రెల్లు పూల మీంచి వీచే గాలి కూడా మెల్లమెల్లగా నాకు నచ్చడం మొదలవుతుంది. మొదట్లో మనిద్దరం కాస్త దూరందూరంగా కూర్చుని ఒకళ్ళనొకళ్ళం ఊరికే చూసుకుంటూ ఉందాం. మాటలు అపార్ధాలకు మూలం కాబట్టి వీలైనంతవరకు మాట్లాడుకోకుండా ఉందాం. రోజు కొంచెం కొంచెం దగ్గరగా జరిగి కూర్చుంటూ ఉంటే చాలు. సాన్నిహిత్యం దానంతట అదే పెరుగుతుంది.

అన్నట్టు నువ్వు రోజూ ఒకే టైంకి ఇక్కడికి రావాలి. ఉదాహరణకు రోజూ సాయంత్రం ఆరు గంటలకు నువ్వు నన్ను కలవడానికి వస్తున్నవనుకో, ఐదు నుంచే నేను నీ కోసం ఎదురు చూస్తాను. ఆ ఆనందం అప్పట్నించి ఆరయ్యేదాకా క్షణక్షణం పెరుగుతూ పోతుంది. ఆరు దాటితే అది ఉద్వేగంగా, ఆందోళనగా మారి ఆనందం విలువేమిటో తెలుస్తుంది, అలా కాకుండా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే వచ్చావనుకో నా మనస్సును నీ రాక కోసం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో తెలియక పైన చెప్పిన భావాలన్నీ మిస్ అయిపోతాను.

ఇదంతా సంప్రదాయం. మచ్చిక సంప్రదాయం. ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళం వెళ్ళీపోయామనుకో. అది చూసి నేను ఏడిస్తే ఏడవొచ్చు గాక. కాని నీ గురించి ఎన్ని ఙ్నాపకాలు ఉండిపోతాయి నా దగ్గర్! అలాగే నా గురించి, నా జాతి గురించి నీకెన్ని కొత్త విషయాలు తెలుస్తాయి! అందుకే చెబుతున్నాను మచ్చిక చేసుకోవడం వల్ల లాభాలే కాని నష్టాలు ఏమీ లేవని'

చెప్పింది నక్క కదా అని కొట్టి పారేయొద్దు. అనుభవం నుంచి చెప్పిందేదైనా వినదగ్గదే......

Sunday, May 28, 2006

కవితా! ఓ కవితా! - 'మహా ప్రస్థానం'

కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?

నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిక్షంలో
ఏయే ఘోషలు, భాషలు, ద్~రుశ్యాల్ తోచాయో ?
నే నేయే చిత్ర విచిత్ర శ్యమంత
రోచిర్ని వహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో ?
నీకై నే నేరిన వేయే ధ్వనులలో,
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్ని నాదాలో!
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝుంఝూ ప్రభంజనం
గజగజ లాడించిన
నడి సంద్రపు కెరటాల్లో, మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం;

ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులలో?
నక్షత్రాంతర్నిబడ నిఖలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుధ్ద్ధం,
అన్నీ, నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం

మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే ద్రుశ్యాలా?
వినిపించే భాష్యాలా ?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ద్వనించే మ్రుదంగ నాదం

ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!

శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మ్రుతు లూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావు బ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులుమూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగ నైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!

కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధ నిమీలత నేత్రాల
భయంకర భాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఝాకంకేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల

హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నని కన్నని విన్నవించగా
మాటలకై వెదుకాడగపోతే
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
చంధస్సుల సర్వపరిష్వంగం వదలి----
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా స్~రుష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పాపపరంపర
లానంద వశంవద హ్~రుదయుని జేస్తే-

నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి...
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగాననూనస్వానావళితం,
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం.
అమోఘ, మఘాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘ్రుణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!

నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న,
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో!
నా బహిరంత రింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడినై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా
నేడో నా ఊహంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హ్~రుద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విన్~రుమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! ఓ కవితా! ఓ కవితా!

-శ్రీ శ్రీ,1937

శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం

జయభేరి - {మహా ప్రస్థానం - శ్రీ శ్రీ}

నేను సైతం
ప్రపంచాగ్ని కి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వ వ్~ఱుష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!

నెను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.

ఎండ కాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగి పోలేదా!
వాన కాలం ముసరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీత కాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేక లేశానే!

నే నొకణ్ణే
నిల్చిపోతే-
చండ్రగాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్న మౌతాయి!

నింగి నుండీ తొంగీ చూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొక్కణ్ణి ధాత్రినిండా
నిండి పోయీ,
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

శ్రీ శ్రీ - జూన్ 2, 1933
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం

మహా ప్రస్థానం- శ్రీ శ్రీ

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచం జలపాతం?

దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోట లన్నిటిని దాటండి!
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

ఎముకుల కుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!

మరో ప్రపంచం,
మహా ప్రపంచం
దరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరుపులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె,
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండీ ముందుకు!
పదండీ త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు ?

శ్రీ శ్రీ - ఏప్రిల్ 12, 1994
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం ీ

Saturday, May 27, 2006

చలం 'ప్రేమ లేఖలు' నుంచి..

స్రుష్టిదైన విరహ బాధ తన మాధుర్య భారం వల్ల తనే పగిలి, మనిద్దర్నీ కన్నది. జనన మప్పుడు మాత్రమే ఆ వొక్క ముహూర్తమే మనమైక్యమై వున్నది.
జన్మ మాధుర్యంలో సోలిన మన చేతుల్ని చిరునవ్వుతో విడతీసి, మేఘశయ్యల మీద ఆనించి ప్రేమ గీతాలు పాడుతూ, నక్షత్ర మార్గాల నూరేగించి, యిద్దరి మధ్యనూ అగాధమైన వ్యవదిని కల్పించి,ఈ లోకంలో వొదిలారు. నా నోటి నుంచి వచ్చిన మొదటి శబ్దం, పేరు లేని నీ పేరు. మూర్ఖులు వీళ్ళు. అది పాల కోసం యేడుపనుకున్నారు.
అది మొదలు నేను నీ కోసం వెతుకుతున్నాను. నే నాడుకున్న బొమ్మల్లొ నీ వున్నావేమోనని వెతికాను. నేను చదువుకున్న పుస్తకాల్లో నీ రూపం ముద్రించారేమోనని చూసాను. కవులు నీ అందాన్ని పాడారేమోనని చదివాను. నీ వెక్కడైనా కనబడతావేమోనని మొహాలు వెతుకుతూ, దేశాలు తిరిగాను.
కనపడవు. కాని నాకు నీవు చిరపరిచయవు.నీ రూపమగోచరము, నీ స్వభావము మనోభావాని కతీతము. కాని నీ కన్న నాకు హ్రుదయానుగత మేదీ లేదు. నీ నామ మనుస్~ఱుతము.కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది. నా వేపు నడిచొచ్చే నీ మ్~రుదు పాద రజము అస్తమయ మేఘాలకి రంగు వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హ్~రుదయంలో ప్రతి నిమిషం ధ్వనిస్తోంది, నా పరమావధి నీవు.

నీ వుండ బట్టి, ఈ ప్రపంచ మింత సుందరమూ, హ్~రుదయాకర్షమూనూ నాకు. కాక పోతే ఈ కొత్త లోకానికి నాకు సంభందమేమిటి? లోహపు బిళ్ళల్నీ, నీతి ప్రతిష్టల్నీ ఆరాధించే ఈ ప్రజలతో నాకు సాపత్యమేమిటి? వీరవరో నాకు తెలియదు. నేను వీరి కర్ధం కాను, నేనిట్లా యెందుకు వెతుకుతున్నానో ఊహించలేరు.
ఒక చోట నీ అధర లావణ్యమూ, ఒక చోట నీ కళ్ళ నలుపూ, యింకొక చోట నీ నడుము వొంపూ, ఒక చోట నీ వొంటి మెరుపూ, ఒక చోటనీ కంఠము ఇంపూ, మరి ఒక చోట నీ వక్షము పొంగూ చూసి నీ నించి ప్రేమ లేఖలని స్వీకరిస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను.

ఒక హ్~ఱుదయంలో నీ ప్రణయ మాధుర్యమూ, ఒక హ్~ఱుదయంలో నీ లీలా వినోదాసక్తీ, ఇంకొక హ్~ఱుదయంలో నీ మాత్~ఱుమార్దవమూ, మరి ఒక హ్~ఱుదయంలో నీ ఆనంద పారవశ్యతా చూసి ఆకర్షింపబడుతున్నాను, స్వీకరించి అనుభవిస్తున్నాను. ఆనందిస్తున్నాను.

కాని - నిరాశ, ఇవన్నీ నువ్వెట్లా కాగలవు? వీళ్ళంతా నన్ను నీతి లేని వాణ్ణి అంటున్నారు, చూడు, కాని నాకు భయమెందుకు, దొంగతనమెందుకు నిన్ను ప్రేమించిన నాకు?

నీ వున్నావని, నీ నుంచి విడి పడ్డానని, నీ కోసం వెతక్కుండా వొక్క నిమిశం నిలువలేనని, వీళ్ళ లెఖ్క నాకు రవ్వంతలేదని, నీవు నాకు వార్తలు పంపుతున్నావని, యెక్కడ దేనిని ప్రేమించినా నిన్నేనని, వీళ్ళకేం తెలుసు?

మ్~రుణమైన ఆత్మలు తమో నిర్మితాలైన మేధస్సులు నిన్నూ-నన్నూ అర్దం చేసుకోగలవా ? చెలం, 1922

Friday, May 26, 2006

ఆడ వారి మనసు-భాష

ఏదో తెలుగు నేల మీద పుట్టాను... బ్రతుకుతున్నాను కాబట్టి..తెలుగు అబ్బింది.
ఏదో సతికాం కాబట్టి... ఇంగ్లీష్ కొంచెం ఒంట బట్టింది.

ఇక బ్రతకాలి...పెళ్ళాం పిల్లల ని పోషించాలి కాబట్టి
ఏవో కొన్ని భాషలు ...(కంప్యూటర్ లాంగ్వేజెస్) నేర్వాల్సి వచ్చింది.

కాని ఈ ఆడ పిల్లల భాష మాత్రం రావట్లేదు(మనసు తెలియటం లేదు). ప్చ్ ఁ....

కాలేజి లో ఉన్నప్పుడు చదివిన గాలిబ్ గీతం గుర్తు వస్తుంది.

నే ఆకసాన్నంటినఁ...
నే సంద్రాన్నీదినఁ..
కానిఁ.. గాలిబ్..
గీఁ ఆడ దాని మనసైతే అర్ధమైతల్లేఁ...

Sunday, May 21, 2006

what science was girl friends????

What Sciense was my Girl Friends ? ? ?
For it was not at all Chemistry! Always Physics!
To Every Action from me there Will be equivalent opposite Reaction to oppose me!
(Newton's 3rd law :-) )
Then I must say about me also!
I strictly follow Neton's 1st law!
"Objects keep on doing what they're doing" (unless acted upon by an unbalanced force).
In detail
An object at rest tends to stay at rest and an object in motion tends to stay in motion with the same speed and in the same direction unless acted upon by an unbalanced force.

Friday, May 19, 2006

నా గురించి నా స్నేహితులు

నేను ఎప్పటి నుంచో... అనుకుంటున్నాను..ఈ విషయం ఇక్కడ వ్రాయాలని..
నా గురించి నా స్నేహితులు ఏమి అనుకుంటున్నారు..అని..
ఈ 2 రోజుల్లో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి.
శుక్ర వారం, మే 19
ప్రమోద్ :Mysterious9849224269
సోమ వారం, మే 22 00:45am
Tina: He is my HERO, He used to call me 'Bangaaram' in college days.

Friday, May 05, 2006

Thursday, April 27, 2006

సాటి మనిషేరా నా పరమాత్మ

సాటి మనిషేరా నా పరమాత్మ except those who flirts my girl friends.

Saturday, April 22, 2006

i am thinking

i am worried about my future.
I am not worried about my career. I am worried about
my personal life.

Wednesday, April 19, 2006

Sunday, April 16, 2006

personal vs officical

Personal vs official.
my personal life vs my official life
today i faced a worst .....

i lost my phone

I love you...t105
I lost my phone. Sony Ericsson T105.
I love it.
Sorry raa. I miss you.
You were with me in all of my times. I never forget you. I can't.
ooopppss. I am no more on 91 9848702368.
I have to edit in all of my accounts.
I lost so many friends numbers. One friend from Maharshtra.
One friend from Tamilnaadu. she will catch me. :-) :-X
and my lovers(yes I have, its plural) still dont know this. they may be trying to this number.

Thursday, October 13, 2005

Information ACT

మే నెలలో పార్లమెంట్ ఉభయ సభలూ ఆమోదించిన సమాచార హక్కు బిల్లుపై...జూన్ 15 న రాష్ట్రపతి సంతకం చేసారు. సమాచారం అంటే... రికార్డులు,డాక్యుమెంటులు,మెమోలు,ఈ-మెయిల్స్,అభిప్రాయాలు,సలహాలు,పత్రికా ప్రకటనలు,సర్క్యులర్లు,ఉత్తర్వులు,లాగ్ పుస్తకాలు,కాంట్రాక్టులు,రిపోర్టులు,పేపర్లు,సాంపిల్స్,మోడల్స్,ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న డేటా...ఇవన్నీ సమాచారం కిందికే వస్తాయి.

Tuesday, October 11, 2005

Information Act

జనం చేతికి ఆయుదం. నేటి నుంచే సమాచార హక్కు. రాష్ట్రం లో కాస్త ఆలస్యం. ఆయుధ పూజ జరిగే విజయదసమి నాడు....పూర్తి స్తాయి సమాచార హక్కు రూపంలో పౌరుల చేతికి కొత్త ఆయుధం అంది వచ్చింది. బుధ వారం నుంచి ఇందులోని సెక్షన్లన్ని దేశమంతటా అదికారికంగా అమలులోకి వచ్చినట్లే.

Saturday, October 08, 2005

My Books & My Friends

నా పుస్తకాలు .కళా తపస్వి యెగోరి-జి.యూదిన్ (థాంక్స్ టు ప్రమోద్) .ఆంద్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర .మహా ప్రస్తానం-శ్రీ శ్రీ .పెట్టుబడి - కార్ల్ మార్క్స్ 3 పుస్తకాలు .ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర .అసమర్ధుని జీవయాత్ర-గొపీ చంద్ (తాజుద్దీన్ దగ్గర ఉంది.) .సిటీ బ్యూటిఫుల్- డా.కేశవ రెడ్డి


My Friends

నా స్నేహితులు:
రంగారావు
ప్రమోద్
తాజుద్దీన్
జనార్ధన్
టీనా*
నారాయణ (కల్యాణ్ జీ ..ఆనంద్ జీ)
* .సురేష్.*
..శ్రీను..